రైతులతో కలిసి వరి నాట్లు వేసిన విద్యార్థులు

by Muthe.Rajitha |

బడికి వెళ్ళి పుస్తకాలతో కుస్తీలు పట్టడమే కాదు.., పొలంలోకి దిగి పంటలు ఎలా పండిస్తారో తెలుసుకోడానికి పొలంబాట పట్టారు ఆ విద్యార్థులు.

రైతులతో కలిసి వరి నాట్లు వేసిన విద్యార్థులు
X

దిశ, వెబ్ డెస్క్ : బడికి వెళ్ళి పుస్తకాలతో కుస్తీలు పట్టడమే కాదు.., పొలంలోకి దిగి పంటలు ఎలా పండిస్తారో తెలుసుకోడానికి పొలంబాట పట్టారు ఆ విద్యార్థులు. వర్షాకాలంలో మొదలయ్యే వారినాట్లు వేసి, బురదలో రైతులు ఎంతటి కష్టం ధార పోస్తారో స్వయంగా చూశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పొలంబాట పట్టారు. గ్రామ సమీపంలోని పొలంలో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు మండల విద్యాధికారి ప్రభాకర్ రావు కూడా ఈ పొలం పనుల్లో పాల్గొన్నారు. క్షేత్రస్థాయి బోధనలో భాగంగా ఈ ఫీల్డ్ విజిట్ నిర్వహించినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.

బియ్యం ధాన్యం రూపంలో ఎలా పండుతుందో విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలియజేశారు. వరి నారు పోయడం, నాట్లు వేయడం వంటి అంశాలను వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా నాట్లు వేస్తూ ఎంజాయ్ చేశారు. విద్యార్థులు పొలంలో నాట్లు వేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story