యూపీలో షాకింగ్ ఘటన.. బోర్డ్ ఎగ్జామ్‌లో జైశ్రీరామ్ అని రాసి పాస్ చేయాలని కోరిన విద్యార్థి

by Ajay Maddhiboyina |

ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోషియాలజీ విద్యార్థి పరీక్ష పత్రంలో జవాబులు రాయకుండానే వదిలేశాడు. సరిగ్గా చదవనప్పుడు సమాధానాలు రాయకపోవడం సహజమే. అయితే సమాధానాలు రాయకపోగా బాబర్ తండ్రి శివాజీ మహరాజ్...జై శ్రీరామ్ అంటూ నినాదాలు రాశాడు.

యూపీలో షాకింగ్ ఘటన.. బోర్డ్ ఎగ్జామ్‌లో జైశ్రీరామ్ అని రాసి పాస్ చేయాలని కోరిన విద్యార్థి
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సోషియాలజీ విద్యార్థి పరీక్ష పత్రంలో జవాబులు రాయకుండానే వదిలేశాడు. సరిగ్గా చదవనప్పుడు సమాధానాలు రాయకపోవడం సహజమే. అయితే సమాధానాలు రాయకపోగా బాబర్ తండ్రి శివాజీ మహరాజ్...జై శ్రీరామ్ అంటూ నినాదాలు రాశాడు. అంతే కాకుండా రూ.100 తీసుకుని తనను పాస్ చేయాలని కోరాడు. రూ.100 నోటును పేపర్ పై అంటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. యూపీలో యువత రోజురోజుకు దారుణంగా తయారవుతున్నారని ఆవేదన చెందాడు. ఇంటర్ చదువుతున్న విద్యార్థి కనీస అకాడమిక్ తెలివితేటలు లేకుండా ఉన్నాడంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం యూపీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో మత గొడవలు సాధారణమేనని కానీ యువతను అందులోకి లాగవద్దని కోరుతున్నారు.

Next Story