- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య.. ఫలితాల్లో చూస్తే మంచి మార్కులతో పాస్!
ఖమ్మం జిల్లాలో విషాదం! ఫెయిల్ అవుతాననే భయంతో విద్యార్థి ఆత్మహత్య. ఫలితాల్లో 347 మార్కులతో పాస్. ఆందోళనలో తల్లిదండ్రులు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు (Telangana Intermediate Exams) రాసిన తర్వాత ఫెయిల్ (Fail) అవుతాననే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ రోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆ విద్యార్థి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. దీంతో విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫలితాల వేళ ఖమ్మం జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన వెలుగుచూసింది.
ఘటన పూర్తి వివరాలు..
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ళ అక్షాంత్ అనే విద్యార్థి ఇంటర్ ప్రథమ సంవత్సరం (Inter first year) చదువుతున్నాడు. పరీక్షలు రాసినప్పటి నుంచి ఫలితాల విషయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తాను ఫెయిల్ అవుతాననే భయంతో మనస్తాపానికి గురైన అక్షాంత్, మధిర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు.
ఫలితాల్లో పాస్.. కానీ ప్రాణం లేదు
అక్షాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఇంటర్ ఫలితాలు (Inter results) విడుదలయ్యాయి. అందులో అక్షాంత్ 347 మార్కులు సాధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్ (Inter first year) పాస్ అయ్యాడు. కొడుకు పాస్ అయ్యాడని సంతోషించాలో.. లేక ఫలితాల భయంతో ప్రాణాలు వదిలాడని ఏడవాలో తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






