Holi Festival : హోలీ వేళ వింత ఆచారం.. దొరికారో పిడిగుద్దులే

by Muthe.Rajitha |

హోలీ పండగ(Holi Festival) వేళ ఆ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది.

Holi Festival : హోలీ వేళ వింత ఆచారం.. దొరికారో పిడిగుద్దులే
X

దిశ, వెబ్ డెస్క్ : హోలీ పండగ(Holi Festival) వేళ ఆ గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. పండగపూట గ్రామస్తులంతా చేరి గుడివద్ద పిడిగుద్దులు గుద్దుకుంటారు(Street Fight). కాస్త వింతగా ఉన్న ఈ ఆచారం తెలంగాణలో నిజామాబాద్(Nizamabad) జిల్లాలో హాన్సా(Hansa) అనే గ్రామంలో జరుగుతుంది. ప్రతియేటా హోలీ పండగను పురస్కరించుకొని గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద పిడిగుద్దులు గుద్దుకునే వింత ఆచారాన్ని దశాబ్దాల కాలం నుంచి జరుపుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే ఈ వింత ఆచారం కాస్త తీవ్ర ఘర్షణలకు దారి తీస్తుండటంతో ఈసారి మాత్రం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గ్రామస్తులు ప్రత్యేక వినతి చేయడంతో ఎట్టకేలకు పోలీసులు 5 నిముషాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ హాన్సా గ్రామస్తులు గురువారం ఈ ఆచారాన్ని పూర్తి చేశారు. ఈ సమరంలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. కాగా ఈ పిడిగుద్దుల ఆచారం వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story