- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టికెట్ కౌంటర్ కాదు బార్.. రైల్వే స్టేషన్‌లోనే మందు తాగుతూ చిల్ అయిన సిబ్బంది
by Bhoopathi Nagaiah |
మద్యం తాగాలంటే బార్ కో, పర్మిట్ రూమ్ కో లేదా వైన్స్ షాపులో కొనుక్కొని ఇంటికి వెళ్లి తాగాలి.

X
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం తాగాలంటే బార్ కో, పర్మిట్ రూమ్ కో లేదా వైన్స్ షాపులో కొనుక్కొని ఇంటికి వెళ్లి తాగాలి. అంతేగానీ ఆఫీస్ లోనో, ఆన్ డ్యూటీలోనో మద్యం తాగరాదు. ఈ చిన్న విషయం వాళ్లకెందుకు తెల్వదో, లేక మమ్ముల్ని ఎవరూ ఏం చేస్తారులే అనే ధైర్యమో తెల్వదు గానీ ఆన్‌డ్యూటీలో, పబ్లిక్ గా ఎంచక్కా మందు కొడుతున్నారు. రైల్వే స్టేషన్ నే బార్‌గా మార్చారు రైల్వే ఉద్యోగులు. పెద్దపల్లి జిల్లా ఓదెల రైల్వే స్టేషన్‌లో పనిచేసే ఎంప్లాయిస్ టికెట్ కౌంటర్‌లోనే మద్యం తాగుతూ చిల్ అయ్యారు. ఈ దృశ్యాన్ని ఒకరు కెమెరాలో బంధించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘనటపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.
Next Story






