సారీ.. నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటున్నా.. భర్తకు వాట్సాప్‌లో ఫొటోలు పంపిన భార్య..

by Sujitha Rachapalli |

ఎన్నో ఆశలతో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఐదునెలలు హ్యాపీగానే గడిచాయి. కానీ సడెన్‌గా షాక్ ఇచ్చింది భార్య. తాను బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకుంటున్నానని.. వాట్సాప్‌లో భర్తకు ఫొటోలు పంపింది.

సారీ.. నేను నా బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుంటున్నా.. భర్తకు వాట్సాప్‌లో ఫొటోలు పంపిన భార్య..
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నో ఆశలతో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఐదునెలలు హ్యాపీగానే గడిచాయి. కానీ సడెన్‌గా షాక్ ఇచ్చింది భార్య. తాను బాయ్ ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకుంటున్నానని.. వాట్సాప్‌లో భర్తకు ఫొటోలు పంపింది. దీంతో కాళ్ల కింద భూమి కంపించినంత పనైంది భర్తకు. బీహార్‌లో ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన జరగ్గా.. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తను వెళ్లిపోవడమే కాకుండా ఇంట్లో రూ. 53వేల నగదు, రూ. 1.70లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లిందని.. తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న మిథునాపురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గురువారం క్లబ్ రోడ్డులోని కాలేజీకి వెళ్తున్నట్లు చెప్పింది భార్య. దీంతో తనను అక్కడ దింపానని.. కానీ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. ఇంటికి రాకపోవడంతో వెతకడం ప్రారంభించానని చెప్పాడు. ఇంతకు ముందు ఆమె కాల్స్ మాట్లాడేదని.. కానీ తనకెప్పుడూ అనుమానం రాలేదని చెప్పాడు. అయితే తనకు అన్‌నోన్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని.. అందులో.. ‘సారీ.. నేను ఇతడిని పెళ్లి చేసుకుంటున్నా’ అంటూ ఫొటోలు పంపిందని తెలిపాడు.

Next Story