- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో చిరు వ్యాపారికి సోనూసూద్ సర్ప్రైజ్
టాలీవుడ్ నటుడు సోనూసూద్ సోనూసూద్ నాలుగు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా సోనూసూద్ బేల్ పూరి అమ్మే చిరు వ్యాపారితో మాట్లాడి ఆమెను ఆశ్చర్యపరిచారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు సోనూసూద్ సోనూసూద్ నాలుగు రోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా సోనూసూద్ బేల్ పూరి అమ్మే చిరు వ్యాపారితో మాట్లాడి ఆమెను ఆశ్చర్యపరిచారు. తిరుమల తిరుగు ప్రయాణంలో సోనూ తిరుపతిలో తట్టపై బేల్ పూరి అమ్ముతున్న జ్యోతి అనే మహిళ వద్దకు వెళ్లి పలకరించారు. సాధారణ వ్యక్తిలా ఆమెతో మాట్లాడుతూ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుండి తిరుమలలో ఉంటున్నారని, గిరాకీ ఎలా ఉందని అడిగారు. బేల్ పూరి ధర అడిగి కొనుగోలు చేశారు.
తిన్న తరవాత చాలా రుచిగా ఉందని చెప్పారు. చిరు వ్యాపారుల దగ్గర కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని సోనూసూద్ పిలుపునిచ్చారు. దీంతో ఆ మహిళ ఎంతో ఆనందపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సోనూసూద్ గతంలోనూ ఇలా చిరువ్యాపారుల వద్దకు వెళ్లి వీడియోలు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కరోనా సమయంలో సేవా కర్యక్రమాలు చేసి ఆయన రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆయన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు సినిమాలు సైతం వరుసపెట్టి చేస్తున్నారు.






