- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నతల్లిపై కొడుకుల కర్కశత్వం.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో
కన్నతల్లి ప్రేమ ఒక అనంత సముద్రం, ఆమె త్యాగం ఒక అడవిలోని గొప్ప వృక్షం. ప్రతి శ్వాసలో పిల్లల భవిష్యత్తును నిర్మించే ఆ దేవత, ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన బహుమతి.

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లి ప్రేమ ఒక అనంత సముద్రం, ఆమె త్యాగం ఒక అడవిలోని గొప్ప వృక్షం. ప్రతి శ్వాసలో పిల్లల భవిష్యత్తును నిర్మించే ఆ దేవత, ప్రపంచంలోని అత్యంత అమూల్యమైన బహుమతి. కానీ, అలాంటి కన్నతల్లిని కొడుకులే నడిరోడ్డుపాలు చేసిన ఘటన మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గూడూరు (Gudur) మండల పరిధిలోని భూపతిపేట (Bhupatipet) గ్రామానికి చెందిన వృద్ధురాలికి నలుగురు కొడుకులు ఉన్నారు.
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు ప్రతి నెల ఒక్కో కొడుకు దగ్గర ఉంటూ వస్తుంది. ఈ క్రమంలోనే ఇంట్లో గొడవల కారణంగా కొడుకులు కన్నతల్లిని బుక్కెడు అన్నం కూడా పట్టబోమని గ్రామంలో ఉన్న రైతు వేదిక వద్ద పడేసి వెళ్లిపోయారు. దీంతో ఆ వృద్ధురాలు తేలికపాటి బెడ్‌షీట్‌తో చలికి తట్టుకోలేక వణుకుతూ గ్రామస్థులకు కనిపించింది. దీంతో గమనించిన గ్రామస్తులు కన్నకొడుకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన శిక్ష పడేలా చూడాలని అధికారులను కోరారు. గ్రామంలో ఒక్కరు ఇలా చేస్తే భవిష్యత్తులో వారిని చూసి మరొకరు కూడా ఇలాంటి పని చేయరని గ్యారంటీ ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.






