బీర్లు, బ్రీజర్లు, విస్కీ.. నాన్నకు ప్రేమతో ఏ బ్రాండ్ వదలని కొడుకు.. నెట్టింట వైరల్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-30 09:19:04  IST  )

చ‌నిపోయినవాళ్ల‌ను గుర్తు చేసుకుని జ‌యంతి, వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం కామ‌న్. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో వాళ్ల‌కు న‌చ్చిన‌వ‌న్నీ వండిపెడుతుంటారు. వాళ్లు తినే ఆహారం, తాగే డ్రింక్స్ అన్నింటిని సిద్ధం చేసి ఫోటో ముందు పెట్టి ఆర‌గించాల‌ని దండం పెట్టుకుంటారు.

బీర్లు, బ్రీజర్లు, విస్కీ.. నాన్నకు ప్రేమతో ఏ బ్రాండ్ వదలని కొడుకు.. నెట్టింట వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్: చ‌నిపోయినవాళ్ల‌ను గుర్తు చేసుకుని జ‌యంతి, వ‌ర్థంతి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం కామ‌న్. ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో వాళ్ల‌కు న‌చ్చిన‌వ‌న్నీ వండిపెడుతుంటారు. వాళ్లు తినే ఆహారం, తాగే డ్రింక్స్ అన్నింటిని సిద్ధం చేసి ఫోటో ముందు పెట్టి ఆర‌గించాల‌ని దండం పెట్టుకుంటారు. హిందూ సంప్ర‌దాయంలో ఇది అనాదిగా వ‌స్తున్న ఆచారం. ఇలా చ‌నిపోయిన‌వారికి న‌చ్చివ‌న్నీ ఫోటో ముందు పెట్టిన త‌ర‌వాత తిరిగి తీసుకుని కుటుంబ స‌భ్యులే తినేస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌నిపోయినవాళ్లు త‌మ ద్వారా ఆ ఆహార‌న్ని తిన్నార‌ని న‌మ్ముతారు. ఓ యువ‌కుడు కూడా ఇలాగే త‌న తండ్రి 34వ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాడు. దానికి సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా తెగ వైర‌ల్ అవుతోంది. దానికి కార‌ణం అత‌డు త‌న తండ్రి ఫోటో వ‌ద్ద పెట్టిన మందుబాటిల్సే. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫోటో చూస్తే తెలుగు రాష్ట్రాల్లోనే జరిగినట్టు కనిపిస్తోంది.

ఇక సాధార‌ణంగానే మ‌ద్యం తాగేవాళ్ల కోసం ఇలా పెడ‌తారు. కానీ ఒక బాటిల్ పెట్టి దాన్నే ఒక‌రిత‌ర‌వాత ఒక‌రు ఫోటో ముందు ఆర‌గిస్తుంటారు. కానీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటోలో యువ‌కుడు ఒక‌టి కాదు ఏకంగా మందులోని ర‌కాల‌న్నీ పెట్టేశాడు. అందులోనూ వివిధ బ్రాండ్స్ పెట్టాడు. అందులో బీర్లు, బ్రీజ‌ర్లు, విస్కీతో పాటు వొడ్కా కూడా ఉంది. అక్క‌డితో ఆగ‌కుండా త‌న తండ్రి సిగ‌రెట్ కూడా కాలుస్తాడ‌ని వాటిని ఓ గ్లాస్ లో అగ‌రొత్తుల మాదిరిగా ఫోటో ముందు పెట్టి అంటించాడు. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు త‌మ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ టైమ్ మీ నాన్న వ‌ర్థంతి కార్య‌క్ర‌మానికి న‌న్ను పిలువు బ్రో అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేయ‌గా.. అవి మీకు తాగాల‌నిపించి తెచ్చ‌కున్నారా లేదంటే నిజంగానే మొక్క‌డానికి తెచ్చుకున్నారా బ్రో అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఈ ఫోటో మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

Next Story