- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ చేస్తూ చెలగాటం..రన్నింగ్ వాహనాలే టార్గెట్
ఢిల్లీలో రీల్స్ చేస్తూ యువత రచ్చ చేస్తోంది. కదిలే వాహనాల డోర్లు తీస్తూ రెచ్చిపోతోంది.

Some Influencers are now opening doors of moving vehicles in Delhi for reels
దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అనేక రకాల వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కూడా కొంతమంది రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు భూమి మీద నిలబడడమే లేదు జనాలు. రకరకాల ఆలోచనలతో రీల్స్ చేస్తూ తెగ పాపులర్ అవుతున్నారు. అలా డబ్బులు కూడా విపరీతంగా సంపాదిస్తున్నారు. అయితే తాజాగా కొంత మంది ఇన్ఫ్లుయెన్సర్లు బరితెగించారు. రోడ్ల పైన పిచ్చి చేష్టలు చేస్తూ జనాలను టెన్షన్ పెడుతున్నారు. రన్నింగ్ వాహనాలను టార్గెట్ గా చేసి రీల్స్ చేస్తున్నారు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు.
రన్నింగ్ వాహనాల టార్గెట్.. రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ
ఢిల్లీ లాంటి రాజధానిలో కొంత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బరితెగిస్తున్నారు. ఎక్కువ వ్యూస్ రావాలని ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు. రన్నింగ్ లో ఉన్న బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల డోర్లు తీస్తున్నారు. వాహనాలకు తమ బైక్స్ అడ్డుపెట్టి మరీ, ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారు. బైక్స్ అడ్డదిడ్డంగా నడుపుతూ... రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఇవి చూసి నెటిజెన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి దుర్మార్గులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా రోడ్లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తే, అందరికీ ప్రమాదమే అంటున్నారు.






