- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీ మెట్రో రైలులో పాము... చుక్కలు చూసిన ప్రయాణికులు..
by Sujitha Rachapalli |
ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొమాన్స్‌కు కేరాఫ్ అయిపోయింది. అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న వార్తలు వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో పాము ఎంటర్ అయిందన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ మెట్రో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రొమాన్స్‌కు కేరాఫ్ అయిపోయింది. అశ్లీల కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్న వార్తలు వింటూనే ఉన్నాం. అయితే తాజాగా ఢిల్లీ మెట్రో రైలులో పాము ఎంటర్ అయిందన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో పాము ఎంటర్ కావడంతో ప్రయాణికులు చుక్కలు చూశారు. ఎవరికి ఎక్కడ కాటేస్తుందోననే భయంతో కొందరు సీట్ల మీదకు ఎక్కితే.. ఇంకొందరు పైన హ్యాంగింగ్స్ హెల్ప్‌తో కాళ్లు కింద పెట్టకుండా నిలబడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే అందులో పాము లేనే లేదు. అసలు ఎంటర్ కాలేదు. ఎవరో ఒకరు కంపార్ట్‌మెంట్‌లో పాము ఉందని స్టార్ట్ చేయడంతో అందరూ బెదిరిపోయారు. నెక్స్ట్ స్టేషన్ వచ్చే వరకు భయపడుతూనే ఉన్నారు. మొత్తానికి పాము లేదని తెలిశాక ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






