బాత్రూం కమోడ్‌లో పాము.. వ్యక్తి షాక్ (వీడియో)

by Disha Web Desk 4 |
బాత్రూం కమోడ్‌లో పాము.. వ్యక్తి షాక్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అర్జెంట్‌గా బాత్రూంకని వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ సీన్ చూసి షాక్ కు గురయ్యాడు. బాత్రూం కమోడ్ లో నక్కిన నాగుపామును చూసి హడలెత్తిపోయాడు. పరుగున బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పాడు. వారు అప్రమత్తమై వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వ్యక్తి పామును చాకచక్యంగా పట్టుకుని ఓ డబ్బాలో బందించాడు. అయితే పాములు పట్టే వ్యక్తి ఆ పామును పట్టే సమయంలో బుసలు కొడుతూ భయపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed