అదిరిపోయే ప్లాన్‌, దొంగ‌ల‌నే బోల్తా కొట్టించిన ఓన‌ర్‌..ఫాగ్ కొట్టి మ‌రి

by velandi.Saikiran |

దొంగ‌ల‌ను బోల్తా కొట్టింంచేందుకు బంగారం దుకాణం ఓన‌ర్ అదిరిపోయే ప్లాన్ చేశాడు. ఫాగ్ కొట్టి మ‌రి,బ‌క‌రా చేశాడు.

అదిరిపోయే ప్లాన్‌, దొంగ‌ల‌నే బోల్తా కొట్టించిన ఓన‌ర్‌..ఫాగ్ కొట్టి మ‌రి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: బంగారం ధరలు విపరీతంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. తులం బంగారం ధర రూ.1.70 లక్షల వరకు ఉంది. రూ.2 ల‌క్ష‌లు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో దొంగతనాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి. మహిళల ఒంటిపై ఉన్న నగలు దొంగలించడం, జువెలరీ షాపులలో చోరీలకు పాల్పడడం లాంటి సంఘటనలు తెరపైకి వస్తున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా దొంగ‌త‌నాలు పెరిగిపోతున్నాయి. అయితే, ఇలాంటి చోరీలకు చెక్ పెట్టేందుకు ఓ జువెలరీ షాప్ ఓనర్ అదిరిపోయే ఫ్లాన్ వేశాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

సీసీ కెమెరాల‌తో పాటు ఫాగ్ సిస్టం

దొంగతనాలు విపరీతంగా జరుగుతోన్న నేపథ్యంలో సొగునామి అనే జ్యువెలరీ షాప్ ఓనర్ సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేశాడు. దానికి తోడు, ఫాగ్ సిస్టం కొత్తగా పెట్టించాడు. అయితే ఈ విషయం తెలియక కొంతమంది దొంగలు, ఈ జువెలరీ దుకాణంలోకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశారు. మొత్తం ఐదుగురు దుకాణంలోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు షాప్ కౌంటర్ టచ్ చేయగానే ఫాగ్ మొదలైంది.

ఇక క్షణాల్లోనే షాప్ మొత్తం పొగ మంచు విస్తరించింది. దీంతో దుకాణంలో ఏది కనిపించని పరిస్థితి చోటు చేసుకుంది. అనంతరం సైర‌న్‌ కూడా మోగడంతో, అక్కడి నుంచి దొంగలు పారిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, ఆ ఓనర్ తెలివిని మెచ్చుకుంటున్నారు. ఇకపై ప్రతి దుకాణపు దారుడు ఇలాంటి టెక్నాలజీ వాడాలని కోరుతున్నారు. క్లిక్

Next Story