నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి..రాఖీతో పాటు బీర్ గిఫ్ట్ గా ఇచ్చిన చెల్లెమ్మ!

by velandi.Saikiran |

రాఖీతో పాటు బీర్ తీసుకువచ్చింది. ఓ ప్లేట్లో రాఖీ, ఒక బీర్ బాటిల్, స్వీట్ తీసుకువచ్చి... తన సోదరుడితో రక్షాబంధన్ పండుగను చేసుకుంది ఆ మహిళ

నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి..రాఖీతో పాటు బీర్ గిఫ్ట్ గా ఇచ్చిన చెల్లెమ్మ!
X

దిశ, వెబ్ డెస్క్: రక్షాబంధన్... సోదరి, సోదరుల మధ్య జరిగే గొప్ప పండగ. ఈ రక్షా బంధన్ ( Raksha Bandhan ) రోజున... అన్న లేదా తమ్ముడుపై ప్రేమతో సోదరీమణులు రాఖీలు కడతారు. ఇక ఆ రాఖీలు కట్టిన తర్వాత... తమ సోదరులకు స్వీట్లు కూడా పెడతారు. అనంతరం కట్నం కింద తమ సోదరీమణులకు... స్పెషల్ గిఫ్టులు, చీరలు లేదా డబ్బులు అయినా ఇస్తారు సోదరులు.

అయితే ఈ ప్రాసెస్ మొత్తం చాలా రొటీన్. కానీ ఇటీవల జరిగిన రక్షాబంధన్ సందర్భంగా ఓ మహిళ.. తన సోదరుడి కోసం అదిరిపోయే ప్లాన్ వేసింది. రాఖీతో పాటు చల్లటి బీర్ ( BEER ) కూడా తీసుకువచ్చింది. ఓ ప్లేట్లో రాఖీ, ఒక బీర్ బాటిల్, స్వీట్ తీసుకువచ్చి... తన సోదరుడితో రక్షాబంధన్ పండుగను చేసుకుంది ఆ మహిళ. దీనికి బదులుగా తన సోదరికి మంచి కట్నమే పెట్టాడు ఆ సోదరుడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ బీరు లాగా నువ్వు కూడా చల్లగా ఉండాలి తల్లి అంటూ ఆ మహిళను మెచ్చుకుంటున్నారు. ఆ చెల్లెమ్మ దేవత రా అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Instagramme Link



Next Story