‘బిగ్‌బాస్’లో చాన్స్ కోసం SI సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్

by Kema Shiva Kumar |

‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 10లో తనకు అవకాశం కల్పించాలంటూ ఓ ఎస్సై చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది.

‘బిగ్‌బాస్’లో చాన్స్ కోసం SI సెల్ఫీ వీడియో.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పోలీస్ డిపార్ట్‌మెంట్ (Police Department)లో పని చేయడం అంటేనే సవాళ్లతో కూడుకున్న పని. ఓ వైపు రాజకీయ ఒత్తిళ్ల.. మరోవైపు నేరాలు, ఘోరాలు, నిద్రలేని రాత్రులు అదో నరక ప్రపంచం. కానీ, అలాంటి డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్.. గ్లామర్, గొడవలు, ఎమోషన్స్‌తో నిండి ఉండే టెలివిజన్ టాప్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ (Bigg Boss) వైపు అడుగులు వేయాలనుకోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నంద్యాల జిల్లా గడివేముల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy), బిగ్‌బాస్ సీజన్-10లో తనకు కంటెస్టెంట్‌గా అవకాశం ఇవ్వాలంటూ విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది.

కూతుళ్ల ప్రోత్సాహంతోనే..

విధి నిర్వహణలో కఠినంగా ఉండే ఎస్ఐ నాగార్జున రెడ్డి.. ఇంట్లో మాత్రం పక్కా ఫ్యామిలీ మెన్. తన ఇద్దరు కుమార్తెల కోరిక మేరకే తాను వీడియో చేస్తున్నట్లుగా స్వయంగా వెల్లడించారు. బిగ్ బాస్ షోను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే తన కూతుళ్లు ఇస్తున్న సపోర్టుతోనే ‘బిగ్‌బాస్’ వెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొన్నాడు. ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉంటూ నిత్యం ఎన్నో సవాళ్లను, మానసిక ఒత్తిడిని తట్టుకుని డ్యూటీ చేస్తున్నాన. నాకు గనుక బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఇస్తే.. అక్కడ ఉండే ఎలాంటి మైండ్ గేమ్స్ అయినా ఆడగలను, నాలోని లీడర్‌షిప్ క్వాలిటీస్ ఏంటో నిరూపించుకుని సత్తా చాటుతా అని నాగార్జున రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఓ పోలీస్ అధికారి ఇలా పబ్లిక్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ షోకు వెళ్తానని SI వీడియో చేయడం ఆసక్తికరంగా ఉన్నా.. అందుకు ప్రభుత్వ నిబంధనలు, ఉన్నతాధికారులు అంగీకరిస్తారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Next Story