- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ బ్యూటీ కోసం వెతుకులాట ప్రారంభించిన 'ఓజీ 2' యూనిట్.. కానీ అదే పెద్ద సమస్య?
'ఓజీ 2'లో బాలీవుడ్ స్టార్ బ్యూటీని హీరోయిన్గా తీసుకోవాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఓజీ’ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, సినిమాలో ఆమె పాత్ర ముగిసిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ‘ఓజీ 2’కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఈ సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు కనిపించబోతున్నారు అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం దర్శకుడు సుజిత్, ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకోసం ఇప్పటికే వెతుకులాట కూడా ప్రారంభించినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీ షెడ్యూల్‌లో ఉన్న నేపథ్యంలో, ఆయనకు అనుకూలమైన తేదీల్లోనే షూటింగ్ జరిపే అవకాశం ఉంది.
ఈ కారణంగా స్టార్ హీరోయిన్ అయితే ఆమె తేదీలను కూడా అందుకు అనుగుణంగా సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటే డేట్స్ పరంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయా అనే కోణంలో కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ‘ఓజీ 2’ కోసం నిజంగానే ఓ స్టార్ హీరోయిన్‌ను రంగంలోకి దింపుతారా? లేక షూటింగ్ ప్లానింగ్ సులభంగా ఉండేలా మరో ఆప్షన్‌ను ఎంచుకుంటారా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.






