అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Jakkula.Mamatha |

మండలానికి చెందిన బానోత్ లకుపతి(30) మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, బయ్యారం: మండలానికి చెందిన బానోత్ లకుపతి(30) మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వెంకట్రాంపురం పంచాయతీ పరిధిలోని శోక్లా తండా గ్రామానికి చెందిన మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా బతుకుతెరువు కోసం హైదరాబాద్‌లో హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య కాలంలో అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళతో నాలుగు నెలల క్రితం పరిచయం, ప్రేమగా మారి లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌తో కలిసి జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందడంతో, బంధువులు విషయం తెలుసుకొని మంచిర్యాల జిల్లాకు గురువారం బయలుదేరినట్లు తెలిపారు. పూర్తి విషయాలు బంధువులు వెల్లడిస్తేనే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Next Story