చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం.. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్

by Jakkula.Mamatha |

చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం, ఎస్ఐఆర్ (SIR) శిక్షణ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు.

చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఘన స్వాగతం.. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ క్యాడర్
X

దిశ, చేవెళ్ల: చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం, ఎస్ఐఆర్ (SIR) శిక్షణ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మల్కాపూర్ శివారులో ఉన్న పద్మావతి కన్వేషన్‌లో మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తరలి వచ్చిన క్యాడర్ ఘన స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి ర్యాలీలో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి, ఉమ్మడి మాజీ జిల్లా అధ్యక్షులు నాగేందర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు స్వప్న, నియోజకవర్గం ఇంచార్జి దేశమోళ్ల ఆంజనేయులు, జిల్లా డీసీఎంస్ చైర్మన్ కృష్ణా రెడ్డి, మాజీ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జి రాంబాబు, పార్టీ యువ నాయకులు కార్తీక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, నారాయణ, మండల పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Next Story