- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పామాయిల్ సాగును పరిశీలించిన ఏవో.. రైతులకు కీలక సూచనలు
హిమాంనగర్ గ్రామంలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహారావు సందర్శించారు.

దిశ, ఏన్కూర్: హిమాంనగర్ గ్రామంలో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ మండల వ్యవసాయ అధికారి అవుకు నరసింహారావు సందర్శించారు. ఈ క్రమంలో రైతులకు పామ్ ఆయిల్ పంట మంచి లాభదాయకమని, రైతులు పామ్ ఆయిల్ పంట వేసుకోవడానికి మొగ్గు చూపాలని చెప్పారు. పంట వేసేటప్పుడు 2-3 అడుగుల లోతు గుంత తీసి 1-2 సంవత్సరాల మొక్కలు నాటితే మొక్కల వేర్లు నేలలో కూచించుకుని పోయి వర్షాభావ పరిస్థితుల్లో ఎటువంటి నష్టం వాటిల్లకుండా దృఢంగా ఉంటాయని సూచించారు. అదే విధంగా పామ్ ఆయిల్‌లో అంతర పంటలు సాగు చేసి అధిక ఆదాయం మరియు ప్రభుత్వం ఎకరాకు 4 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుందని చెప్పారు. రైతులు పామ్ ఆయిల్ సాగును విస్తృతంగా పెంచి మంచి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సపావట్ సైదులు రైతు సేవా కేంద్రం ప్రతినిధి సాయి రైతులు బానోత్ సురేష్, బానోత్ రాజోలి తదితరులు పాల్గొన్నారు.






