నేను అలాంటి వ్యాధితో బాధ పడుతున్నా.. అందుకే అలా అయిపోయా.. హీరో విష్ణు విశాల్ షాకింగ్ పోస్ట్

by Chukka Sudharani |

కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ గత కొద్ది రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా స్పందిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు.

నేను అలాంటి వ్యాధితో బాధ పడుతున్నా.. అందుకే అలా అయిపోయా.. హీరో విష్ణు విశాల్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ గత కొద్ది రోజులుగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా స్పందిస్తూ ఓ నోట్ రిలీజ్ చేశాడు. ‘అందరికీ హాయ్.. అన్నిటికంటే ముందుగా మీ కామెంట్లు, సందేశాల ద్వారా మీరు చూపిన ప్రేమకు, శ్రద్ధకు ధన్యవాదాలు. ఇది నాకు నిజంగా చాలా విలువైనది. అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఈ మధ్య నా ముఖం అలసిపోయినట్లు కనిపిస్తోందని మీలో చాలామంది గమనించారు. దీనికి కారణం ఏమిటంటే.. నేను గత 3-4 సంవత్సరాలుగా ఒక ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నాను. ఆ వ్యాధి కోసం డాక్టర్స్ నాకు సూచించిన మందులు తీసుకుంటున్నా. మీరు గమనిస్తున్న కడుపు ఉబ్బరంతో సహా కొన్ని మార్పులు నా బాడీలో కలుగుతున్నాయి. నా ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి.. ఈ చికిత్స వైద్యపరంగా అవసరం. అయినప్పటికీ, మీ ప్రేమ, నేను నమ్మే పని, అలాగే 'గట్ట కుస్తీ 2' కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ప్రతి ఒక్కరి పట్ల నాకున్న బాధ్యత నన్ను ముందుకు నడిపించాయి. అందుకే నేను సినిమా ప్రమోషన్ల కోసం మీ అందరి కోసం హాజరవుతూనే ఉన్నాను. నా ఆరోగ్యం త్వరలో మెరుగుపడుతుందని ఆశిస్తున్నా. మీ ఆందోళన నన్ను నేను మరింత జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రోత్సహించింది. ప్రమోషన్ల చివరి వారంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో నేను మరింత ఉత్సాహంతో నిండిపోయాను. జులై 3న థియేటర్లలో 'గట్ట కుస్తీ 2'ను మీరందరూ చూడటం కోసం నేను వేచి ఉండలేకపోతున్నాను.. మీ ప్రేమకు, మద్ధతుకు నిజంగా ధన్యవాదములు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story