- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హస్త ప్రయోగంతో అంగస్తంభన సమస్య?
డాక్టర్ గారు.. నా వయసు 27 సంవత్సరాలు. నాకు చాలా ఏళ్ల నుంచి హస్త ప్రయోగం అలవాటుంది. ఇంట్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ స్త్రీతో శృంగారంలో పాల్గొనలేదు.

ప్రశ్న : డాక్టర్ గారు.. నా వయసు 27 సంవత్సరాలు. నాకు చాలా ఏళ్ల నుంచి హస్త ప్రయోగం అలవాటుంది. ఇంట్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏ స్త్రీతో శృంగారంలో పాల్గొనలేదు. కానీ ఈ మధ్య నాకు అంగస్తంభన పూర్తి స్థాయిలో కావడం లేదు. ఎందుకు నా అలవాటే దానికి కారణమా? గతంలో మద్యం అలవాటుంది. కానీ ఇప్పుడు మానేసాను. నాకు భయంగా ఉంది పెళ్లి చేసుకునే అర్హత నాకు ఉందా? అమ్మాయి జీవితం పాడు చేస్తానేమో అనే భయం కలుగుతుంది. నేనేం చేయాలి చెప్పండి. -నర్సిం, మంచిర్యాల.
జవాబు: హస్తప్రయోగానికి, అంగస్తంభన లోపానికి అంటే erectile dysfunction(ED/ఈడీ-ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్)కు సంబంధం లేదు. మరీ హస్తప్రయోగం ఒక మానసిక అబ్సెషన్‌గా మారితే తప్ప అంటే రోజుకు పదుల సంఖ్యలో చేసుకునే అలవాటు వలన హెచ్‌పీ చేస్తే తప్ప అంగం గట్టిపడని మనోలైంగిక సమస్యకి వెళ్లిపోయే స్థితి అరుదుగా కొద్ది మందిలో ఉంటుంది. ఇక అంగం గట్టి పడకపోవడానికి శారీరక కారణాలు చాలా ఉంటాయి. బీ.పీ, షుగర్, గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్య, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, వరిబీజం, లివర్, కిడ్నీ సమస్యలు, రక్తనాళాల్లో సమస్యలు, సెక్స్ హార్మోన్లు తక్కువగా ఉండడం, సిగరెట్, ఆల్కహాల్, గుట్కా అలవాట్లు, తీవ్రమైన మానసిక సమస్యలు.. సెక్స్ విషయంలో పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, భయానికి లోనవడం, ఆత్మనూన్యత లాంటి వాటి వలన కూడా రక్తసరఫరా సరిగ్గా కాక అంగస్తంభన లోపం ఏర్పడవచ్చు. ఇంత చిన్న వయసులో నీకు నేను చెప్పిన పై జబ్బులు ఉండే అవకాశం లేదు కానీ చెప్పలేము కాబట్టి ఒకసారి ఈడీ ప్రొఫైల్ చేయించుకోవాలి. దీనివల్ల వ్యాధి నిర్ధారణ జరిగి సరైన చికిత్స అందుతుంది. మద్యం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. పూర్తిగా మానేయాలి. ఇక పెళ్లికి ముందు పనికి వస్తానో లేదో అని పరీక్షించుకుందామని సెక్స్ సంబంధాల్లోకి వెళితే.. శీఘ్రస్ఖలన సమస్య.. ఈడీ అంటే అంగ స్తంభన సమస్యతోపాటు అన్నిరకాల సుఖవ్యాధులు, ప్రాణాంతకమైన హెచ్ఐవీ వ్యాధి రావచ్చు. పెళ్లయ్యాక నీ భార్యకు అంటొచ్చు. పెళ్లి, సెక్స్ రెండూ విలువలతో కూడిన సామాజిక బాధ్యతలని గుర్తుపెట్టుకో. తర్వాత హస్తప్రయోగానికి, ఈడీకి సంబంధం ఉందని ఆశాస్త్రీయమైన అపోహను పోగొట్టుకో లేకపోతే అదే నీలో సెక్స్ సమస్యలు సృష్టిస్తుంది. ముందు నువ్వు ఒక మంచి సెక్స్ కౌన్సెలర్‌ను కలువు.






