- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలి : కలెక్టర్
by Taduka Kalyani |
నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు.

X
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ అభివృద్ధి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో వరదల నివారణ చర్యలు, ఘన వ్యర్థాల నిర్వహణ, పట్టణ పరిశుభ్రత, మొక్కలు నాటడం, ఎస్ఐఆర్ ప్రక్రియ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ సాయికుమార్ , తహసిల్దార్ శ్రీనివాస్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story






