చందానగర్‌లోని ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

by Taduka Kalyani |

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చందానగర్ ఓల్డ్ ముంబై హైవేలో ఉన్న ది ఫుడ్ ప్లానెట్ (The Food Planet) రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

చందానగర్‌లోని ఫుడ్ ప్లానెట్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
X

దిశ, శేరిలింగంపల్లి : సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చందానగర్ ఓల్డ్ ముంబై హైవేలో ఉన్న ది ఫుడ్ ప్లానెట్ (The Food Planet) రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ బృందాలు సోదాలు నిర్వహించాయి. తనిఖీల్లో కిచెన్‌లో అత్యంత అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. గడువు ముగిసిన మటన్, లేబుల్ లేని పెరుగు నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. జిడ్డు పట్టిన కిచెన్ సీలింగ్‌లు, పైప్‌లైన్లు, డ్రైనేజీల్లో పేరుకుపోయిన ఆహార వ్యర్థాలు కనిపించాయి. కిచెన్ అంతటా ఈగలు సంచరిస్తుండటాన్ని అధికారులు నమోదు చేశారు. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు లేకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా పాడైపోయిన చాపింగ్ బోర్డులు, తుప్పు పట్టిన ఇనుప కత్తులతోనే ఆహారం తయారు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. సిబ్బంది హెయిర్ నెట్స్, గ్లౌజులు ధరించినప్పటికీ ఏప్రాన్లు ధరించకపోవడం, గోర్లు కత్తిరించుకోకపోవడం వంటి పరిశుభ్రత లోపాలను కూడా ఫుడ్ సేఫ్టీ బృందాలు గుర్తించాయి. రెస్టారెంట్ యాజమాన్యానికి లోపాలపై నోటీసులు జారీ చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎగ్జాస్ట్‌లు, సీలింగ్ పైప్‌లైన్‌లు జిడ్డుగా ఉన్నాయి. వైద్య ధృవీకరణ, కీటక నియంత్రణ, నీటి పరీక్ష, ప్యాకేజింగ్ రికార్డులు అందుబాటులో లేవు మాంసాహారం నిల్వ చేసే రిఫ్రిజిరేటర్లను సరిగ్గా నిర్వహించడం లేదు. డ్రైన్‌లలో ఆహార వ్యర్థాలు చేరి అపరిశుభ్రమైన పరిస్థితులకు కారణమవుతున్నాయనీ నోటీసులు జారీ చేశారు.

Next Story