ఖైరతాబాద్‌ మహాగణపతి కర్రపూజ.. ఈసారి గణనాథుడి లుక్ ఇదే

by Ajay Maddhiboyina |

ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి నేడు క‌ర్ర‌పూజ చేసి విగ్ర‌హ త‌యారీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. గ‌ణ‌ప‌తి న‌మూనా పోస్ట‌ర్ ను దానం విడుద‌ల చేశారు.

ఖైరతాబాద్‌ మహాగణపతి కర్రపూజ.. ఈసారి గణనాథుడి లుక్ ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తికి నేడు క‌ర్ర‌పూజ చేసి విగ్ర‌హ త‌యారీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, ఎంపీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. గ‌ణ‌ప‌తి న‌మూనా పోస్ట‌ర్ ను దానం విడుద‌ల చేశారు. ఈసారి పంచ‌ముఖ సంక‌ట‌హ‌ర మ‌హాగ‌ణ‌పతి రూపంలో స్వామి వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. మ‌హాగ‌ణ‌ప‌తి కుడివైపు సోమ‌నాథ జ్యోతిర్లింగం, ఎడ‌మ‌వైపు కాళికామాత విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిఏడాది ఇతర రాష్ట్రాల నుండి సైతం మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నేడు కర్రపూజతో విగ్రహ తయారీ అధికారికంగా ప్రారంభం కావడంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక ప్రతి ఏడాది విగ్రహాన్ని సరికొత్తగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. విగ్రహంలో ఆధ్యాత్మిక సందేశంతో పాటు సామాజిక అంశాలను ప్రతిబింబించే విధంగా రూపకల్పన చేస్తుండటం అందరినీ ఆకర్షిస్తోంది.

Next Story