- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రధానితో అమెజాన్ సీఈఓ భేటీ.. భారీ పెట్టుబడుల ప్లాన్ వివరణ
అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. భారత్ లో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సంచలన ప్రకటన చేయగా.. తాజాగా వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెజాన్ సంస్థ 2026 -2030 మధ్య భారత్ లో 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. వీటిలో 13 బిలియన్ డాలర్లను ఏఐ, క్లౌడ్ ఇన్ ఫ్రాను విస్తరించేందుకు ఖర్చు చేయనుంది. ఫలితంగా 2030 నాటికి దేశంలో 3.8 మిలియన్ల ఉద్యోగాలు కల్పించేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు ఈ-కామర్స్ లోనూ 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల ప్రణాళికను ఆండీ జెస్సీ.. ప్రధాని నరేంద్రమోడీకి వివరించారు.
ముంబై, హైదరాబాద్ లలో డేటా సెంటర్ల విస్తరణ
అదనంగా ప్రకటించిన 13 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముంబై, హైదరాబాద్ నగరాల్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు. ఫలితంగా భారతీయ స్టార్టప్ లు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు అత్యాధునిక ఏఐ చిప్స్, క్లౌడ్ టెక్నాలజీ, డెవలపర్ టూల్స్ ఈజీగా అందుబాటులోకి రానున్నాయి.
ప్రధానితో భేటీ అనంతరం.. ఆండీ మీడియాతో మాట్లాడుతూ.. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాధనలో అమెజాన్ దీర్ఘకాల భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. డిజిటలైజేషన్, ఉద్యోగాల కల్పన, ఎగుమతుల్ని ప్రోత్సహించడంలో భారత ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే తమ వ్యాపార వ్యూహాలున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ-కామర్స్ డెలివరీ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేస్తామని, టైర్-3, టైర్-4 నగరాల కోసం 20కి పైగా కొత్త ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లు, 100కు పైగా లాస్ట్ మైల్ డెలివరీ స్టేషన్లను ప్రారంభిస్తామన్నారు. డెలివరీ బాయ్స్ సంక్షేమం కోసం సమ్మాన్ అనే సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించిన ఆండీ.. అందుకోసం 300 మిలియన్ డాలర్ల నిధుల్లో కొంతభాగాన్ని ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. డెలివరీ బాయ్స్ పిల్లల చదువుల కోసం స్కాలర్ షిప్ లు ఇవ్వనున్నారు.






