- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముకునూర్‌లో రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభం
మండల పరిధిలోని ముకునూర్ రైతువేదికలో గురువారం విత్తన మేళాను గ్రామ సర్పంచ్ సన్నాయిల శిల్ప ప్రేమాకర్ ప్రారంభించారు.

దిశ, ఇబ్రహీంపట్నం : మండల పరిధిలోని ముకునూర్ రైతువేదికలో గురువారం విత్తన మేళాను గ్రామ సర్పంచ్ సన్నాయిల శిల్ప ప్రేమాకర్ ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్వల్పకాలిక, మంచి దిగుబడినిచ్చే విత్తనాలపై అవగాహన కల్పించేందుకు ఈ విత్తన మేళాను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ మేళాలో ఆర్ఎన్ఆర్-15048, తెలంగాణ సోనా, కెఎన్ఎం- 1638, హెచ్ఎంటీ సోనా వంటి సన్నరకం, స్వల్పకాలిక వరి విత్తనాలను ప్రదర్శించారు. వీటితో పాటు జొన్న, పప్పు ధాన్యాలు, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డిఏపి వంటి ఎరువులను రైతులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతువేదికలతో పాటు స్థానిక సొసైటీల్లోనూ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులందరూ వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకొని, అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకొని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారి సృజన తదితరులు పాల్గొన్నారు.






