- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపానుకు ముందు నిశ్శబ్దం ఉంటుంది... ఓజీ 2 నుంచి బ్లాక్ బస్టర్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీకి సీక్వెల్‌గా ‘ఓజీ 2’ రానున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ సినిమా పనులు అధికారికంగా ప్రారంభమయినట్లు తెలుపుతూ చిత్రబృందం ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ‘OGUniverse Begins’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ‘గంభీర కథ సిద్ధమవుతోంది.. తుపాను రావడానికి ముందు నిశ్శబ్దం ఉంటుంది’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది.
ఇక విడుదలైన వీడియోలో డైరెక్టర్ సుజీత్‌తో కలిసి పవన్ కల్యాణ్ స్క్రిప్ట్‌పై చర్చిస్తున్నట్లు చూపించారు. మొత్తం స్క్రిప్ట్ చర్చించుకున్న తర్వాత పవన్ కల్యాణ్ చివరిలో ‘నేను రెడీ’ అని చెప్పడం మెగా అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో ‘ఓజీ 2’ షూటింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని స్పష్టమవుతుండగా.. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ‘ఓజీ’కి మ్యూజిక్ అందించిన థమన్.. ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.






