- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీళ్ల కోసం రోడ్డెక్కిన ప్రజలు
తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం చెంగిచెర్ల జలమండలి కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు.

దిశ, మేడిపల్లి : తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న బోడుప్పల్, చెంగిచెర్ల ప్రాంతాల ప్రజలకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం చెంగిచెర్ల జలమండలి కార్యాలయం వద్ద భారీ నిరసన చేపట్టారు. కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బిందెలతో ఆందోళన నిర్వహించారు. అనంతరం కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. రోడ్డు పై బైఠాయించడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లక్షలాది జనాభా ఉన్న బోడుప్పల్–చెంగిచెర్ల ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. వారానికి ఒకసారి మాత్రమే నీరు వస్తుండటంతో ప్రజలు ట్యాంకర్ల పై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో కుటుంబాల పై అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.






