- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవు : హైడ్రా
నాలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు.

దిశ, ఘట్కేసర్ : నాలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు. గురువారం ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ 8 పరిధి జోడిమెట్ల చౌరస్తా మెదా కంపెనీ ఎదురుగా నాలాలను మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలిసి హైడ్రా అధికారులు పరిశీలించారు. జోడిమెట్ల చౌరస్తా మేధా కంపెనీ ఎదురుగా నాలాల కబ్జా, అక్రమ నిర్మాణాలను అడ్డుకుని నాలాలు కాపాడాలని కొండల్ రెడ్డి ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన హైడ్రా అధికారులు నాలాలను పరిశీలించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు చెప్పినట్లు కొండల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హైడ్రా డీఎస్పీ మోహన్ రావు, మున్సిపల్, ఏఈ విశేష్ నాయక్, అధికారులు, పోచారం మాజీ ఉపసర్పంచ్ అకిటి బాల్ రెడ్డి, రాష్ట్ర గిరిజన నాయకులు జితేందర్ నాయక్, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.






