Viral: నెలకు కోటి సంపాదిస్తున్న 19ఏళ్ల కుర్రాడు

by Sujitha Rachapalli |   (  Updated:2026-06-25 09:36:53  IST  )

టీనేజర్.. కానీ నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. మూడు రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. స్వయంగా ఏఐ గురించి నేర్చుకున్న పిల్లాడు.. ఏకంగా కంపెనీ పెట్టాడు.

Viral: నెలకు కోటి సంపాదిస్తున్న 19ఏళ్ల కుర్రాడు
X

దిశ, ఫీచర్స్ : టీనేజర్.. కానీ నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. మూడు రోజులుగా నెట్టింట్లో వైరల్ అవుతున్నాడు. స్వయంగా ఏఐ గురించి నేర్చుకున్న పిల్లాడు.. ఏకంగా కంపెనీ పెట్టాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఫ్యామిలీ కష్టాలు.. మోటివేషన్..

లింక్డ్‌ఇన్‌లో టీనేజర్ ఆయుష్ సింగ్ కథ వైరల్ అయింది. టాప్‌మేట్ సహ స్థాపకుడు, సీటీఓ దినేష్ సింగ్.. ఆయుష్ స్టోరీని పంచుకున్నాక ఎంతో మంది ఆ పిల్లాడి ఫ్యాన్స్ అయిపోయారు. ఇంతకీ దినేష్ సింగ్ ఏం చెప్పాడంటే...

‘అతను IIT కాదు, MIT గ్రాడ్ కాదు, సిల్వర్ స్పూన్‌తో పుట్టలేదు’ అని రాసుకొచ్చాడు. కొవిడ్ సమయంలో తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో... తట్టుకోలేక పదమూడేళ్ల వయసులోనే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్ లైన్ లెర్నింగ్‌పై కాన్సంట్రేట్ చేశాడు. పాత ల్యాప్‌టాప్, ఇతరుల ఇంటర్నెట్, ఉచితంగా అందుబాటులో ఉన్న ఎడ్యుకేషన్ సోర్సెస్ సాయంతో మెషిన్ లెర్నింగ్ స్వయంగా నేర్చుకున్నాడు. తన పట్టుదల, కష్టానికి తక్కువ కాలంలోనే ఫలితాలు రావడం ప్రారంభించాయి.

విదేశీ కంపెనీలతో వర్క్

ఆయుష్ విదేశీ స్టార్టప్‌లతో పని చేయడం మొదలుపెట్టాడు. 14 ఏళ్ల వయసులో అతను సృష్టించిన ఒక ఎడ్యుకేషన్ కోర్సును మాసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పబ్లిక్‌గా సిఫార్సు చేసిందంటే తన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తర్వాతి సంవత్సరాల్లో అయుష్ అనేక AI సంబంధిత రోల్స్‌లో వర్క్ చేశాడు. అమెరికా స్టార్టప్‌కు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్‌లో సహకరించాడు. డేటా సైంటిస్ట్‌గా, MLOps ఇంజనీర్‌గా పని చేశాడు. అంతర్న్ అనే సంస్థను స్థాపించాడు. తర్వాత సెకండ్ బ్రెయిన్ ల్యాబ్స్‌ను కో-ఫౌండర్‌గా స్థాపించాడు. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 100K ఫాలోవర్స్‌ను కలిగి ఉన్నాడు.

నెలకు కోటి సంపాదన

అయితే తన నాలెడ్జ్‌ను డబ్బుగా మార్చడమే.. ఆ 19 ఏళ్ల పిల్లాడికి సవాల్‌గా మారింది. అయుష్ ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా ఆశావాదులైన ఇంజనీర్లకు AI కాన్సెప్టులు నేర్పుతూ..వారికి అవకాశాలు అందించడంలో సహాయపడుతున్నప్పటికీ, ఆ నైపుణ్యాన్ని స్కేలబుల్ బిజినెస్‌గా మార్చడం కష్టమైంది. ప్యాకేజింగ్, పొజిషనింగ్, సెల్ చేసే సిస్టమ్ లోపించింది. ఆ భాగాన్ని టాప్‌మేట్ బిల్డ్ చేసింది. అయుష్ ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌పై హోస్ట్ చేసే ప్రీమియం AI లెర్నింగ్ కోహార్టుల ద్వారా నెలకు సుమారు రూ.1 కోటి సంపాదిస్తున్నాడు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘28 ఏళ్లు వచ్చిన నేను.. అతని సక్సెస్ చూసి ఈర్ష్యపడుతున్నా.. డిప్రెషన్‌లోకి వెళ్తున్నా’, ‘ఈ స్టోరీ చాలా మోటివేషన్ ఇస్తోంది’ అని కామెంట్ చేశారు.

Next Story