నేను ప్రజల గుండెల్లో ఉన్నా.. విజయ్ కామెంట్స్ పై స్టాలిన్ కౌంటర్

by Ajay Maddhiboyina |

త‌మిళ‌నాడు అసెంబ్లీలో మీ నాన్న ఎక్క‌డ అంటూ సీఎం విజయ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉదయనిధి స్టాలిన్‌తో వ్యంగ్యంగా మాట్లాడటం తమిళరాజకీయాల్లో దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను ప్రజల గుండెల్లో ఉన్నా.. విజయ్ కామెంట్స్ పై స్టాలిన్ కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు అసెంబ్లీలో మీ నాన్న ఎక్క‌డ అంటూ సీఎం విజయ్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉదయనిధి స్టాలిన్‌తో వ్యంగ్యంగా మాట్లాడటం తమిళరాజకీయాల్లో దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ప్రజల హృద‌యాల్లో ఉన్నాన‌ని అన్నారు. నేను అసెంబ్లీలో లేక‌పోవ‌చ్చు కానీ ప్ర‌జ‌ల హృద‌యాల్లో.. ప్ర‌జ‌లు న‌న్ను వెతికే ప్ర‌తిచోట నేను ఉన్నా అంటూ స‌మాధానం ఇచ్చారు. విజ‌య్ వ్యాఖ్య‌ల‌పై సొంత కూట‌మిలోనూ కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

విజ‌య్ కామెంట్స్ సీఎం ప‌ద‌వి గౌర‌వాన్ని ప్ర‌తిబింబించేలా లేవ‌ని, విజ‌య్ వ్య‌క్తిగ‌త ప్ర‌స్తావ‌న చేయ‌కుండా ఉండాల్సింద‌ని వీసీకే అధినేత తోల్ తిరుమావ‌ళ‌వ‌న్ అన్నారు. అసెంబ్లీ మ‌ర్యాద‌ను కాపాడాల‌ని సీఎంను కోరారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీకి స్టాలిన్ త్వరలోనే తిరిగి వస్తారు అంటూ డీఎంకే నాయకుడు, ఎమ్మెల్యే కేెెెఎన్ నెహ్రూ అన్నారు. ఇప్పటి వరకు కార్యకర్తలు సైలెంట్ గా ఉన్నప్పటికీ, మాజీ సీఎం సభకు తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. దీంతో విజయ్ రాజీనామా చేసిన అసెంబ్లీ స్థానం నుండి స్టాలిన్ బరిలో దిగుతారనే ప్రచారం మరోసారి జోరందుకుంది.

Next Story