- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తు వ్యసనానికి దూరంగా ఉంటేనే జీవితంలో విజయం
మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటేనే జీవితంలో విజయవంతంగా ముందుకు సాగగలమని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు.

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటేనే జీవితంలో విజయవంతంగా ముందుకు సాగగలమని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. గురువారం భువనగిరి పట్టణంలోని న్యూ హోప్ అసోసియేషన్ జిల్లా డీ-అడిక్షన్ సెంటర్‌ను ఆయన సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న వారితో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవస్థ, సమాజం తీవ్రంగా దెబ్బతింటాయని అన్నారు. చెడు అలవాట్లను పూర్తిగా విడిచిపెట్టి, పునరావాస కేంద్రాలు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత క్రీడలు, విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలపై దృష్టి సారించాలని, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి పోలీసు శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల నిర్మూలనకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, టౌన్ ఇన్‌స్పెక్టర్ రమేష్, రూరల్ ఎస్‌హెచ్‌ఓ మిర్యాల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






