ఎస్ఐఆర్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: తహసీల్దార్ పి.శ్రీనివాస్

by Jakkula.Mamatha |

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను నమోదుచేసుకోవాలని తహసీల్దార్ పి.శ్రీనివాస్ కోరారు.

ఎస్ఐఆర్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: తహసీల్దార్ పి.శ్రీనివాస్
X

దిశ, మిర్యాలగూడ రూరల్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలను నమోదుచేసుకోవాలని తహసీల్దార్ పి.శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాల ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసిన అర్హులైన యువత కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

అలాగే ఓటరు జాబితాలో పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాల్లో మార్పులు ఉన్నవారు సంబంధిత ఫారాల్లో స్పష్టంగా నమోదు చేసి సమర్పించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకుని ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఓటరు జాబితాల ప్రక్షాళన విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ, ఎన్యుమరేషన్ ఫారాల నింపడంలో అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహకారం అందించాలని తహసీల్దార్ పి.శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

Next Story