- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాహం అంటూ వచ్చి దారుణం.. మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ!
by Jakkula.Mamatha |
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

X
దిశ, గూడూరు: మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన దోసపాటి యాదమ్మ గురువారం ఉదయం 6 గంటలకు తన ఇంటి ముందు నిల్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు దాహం వేస్తుంది కొంచెం నీళ్ళు ఇవ్వమని అడగగా సదరు మహిళ నీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెతో పాటు ఇంట్లోకి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దోచుకెళ్లారు. మహిళ కేకలు వేయడంతో చుట్టూ పక్కల వారు వచ్చే లోపు అక్కడి నుంచి వారు పారిపోయారు. సదరు మహిళ విషయం పోలీసులకు తెలపడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.
Next Story






