అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Batti.Sumithra |

వ్యవసాయ పొలంలో బోరు మోటర్ వద్ద మొఖం కడుక్కోవడానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని వాడ్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది.

అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, మిడ్జిల్ : వ్యవసాయ పొలంలో బోరు మోటర్ వద్ద మొఖం కడుక్కోవడానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని వాడ్యాల గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామానికి చెందిన మురళి (50) మిడ్జిల్ మండలం వాడ్యాల గ్రామ శివారులో బోరు మోటర్ వద్ద మృతి చెందారు. స్థానికులు కొందరు ఫిట్స్ వచ్చాయని, కుటుంబ సభ్యులు బోరు మోటార్ వద్ద విద్యుత్ ప్రమాదం తోనే మృతి చెంది ఉంటారని అంటున్నారు. సంఘటన పై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Next Story