- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డేంజర్‌లో సింగూరు ప్రాజెక్టు.. ఏ క్షణానైనా కట్టకు గండిపడే చాన్స్
హైదరాబాద్ (Hyderbad) ప్రజల తాగునీటి అవసరాలకు వర ప్రదాయణిగా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) ప్రస్తుతం డేంజర్ జోన్ కొట్టుమిట్టాడుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderbad) ప్రజల తాగునీటి అవసరాలకు వర ప్రదాయణిగా ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ (Singur Project) ప్రస్తుతం డేంజర్ జోన్ కొట్టుమిట్టాడుతోంది. మెదక్ జిల్లాలో మంజీరా నదిపై ఉన్న ఈ డ్యామ్‌ను బ్యాక్ వాటర్ స్టోరేజీ కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సింగూరు జలాశయానికి మల్లన్న సాగర్ ప్రాజెక్టు (Mallanna Sagar Project) నుంచి భారీగా ఇన్ ఫ్లో వస్తుంది. ఈ నేపథ్యంలోనే సింగూరు డ్యామ్ భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏ క్షణమైనా కట్టకు గండిపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
అయితే, డ్యామ్ ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్‌మెంట్‌కు ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి నివేదిక నీటి పారుదల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. జూన్ 23న ప్రాజెక్టును పరిశీలించిన DSRP కమిటీ పరిశీలించింది. సింగూరు ప్రాజెక్టు దెబ్బతినడానికి సామర్ధ్యానికి మించి నీటిని నిల్వ చేయడమేనని కమిటీ నిర్ధారించింది. 1976లో 517 మీటర్ల నీటి నిల్వకు వీలుగా ప్రాజెక్టును నిర్మించగా.. మిషన్ భగీరథ (Mission Bhagiratha) అవసరాల కోసం నీటి సామర్ధ్యాన్ని 520 మీటర్లకు అనుమతిస్తూ 2017లో బీఆర్ఎస్ సర్కార్ (BRS Government) జీవో ఇచ్చింది. పరిమితికి మించి 522 మీటర్ల వరకు సింగూరు డ్యామ్‌లో నీటిని స్టోర్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని డీఎస్ఆర్‌పీ కమిటీ వెల్లడించింది.






