- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏంటీ అరటిపండు ఇలా తినాలా! అరెరె.. ఇది తెలియక ఇన్ని రోజులు మాములుగా తినేశాగా!
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే పండ్లలో అరటిపండు ప్రత్యేకమైనది.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే పండ్లలో అరటిపండు (Banana) ప్రత్యేకమైనది. తీయటి రుచి, వెంటనే శక్తిని అందించే లక్షణాలు, విటమిన్లు, మినరల్స్ వంటివి ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఎండ, వాన తేడా లేకుండా ఏ సీజన్‌లోనైనా దొరుకే అరటిపండు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటుంటారు. అయితే, మనం సాధారణంగా అరటిపండును ఎలా తింటాం? ఇదేం పిచ్చి ప్రశ్న.. చేతితో తొక్క తీసేసి, నేరుగా నొట్లో పెట్టేస్తాం అని అనుకుంటున్నారు కదా! అరటిపండును అలా తినకూడదట. దీన్ని తినేందుకు ఓ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుందట. అందుకోసం ఫోర్క్, నైఫ్‌లు కావాలి. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? తాజాగా నెట్టింట (Social media) ఇందుకు సంబంధించి వీడియో తెగ వైరల్‌గా (Viral) మారింది. దీంతో అరటిపండు తినటం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత ఎటికెట్ నిపుణుడు విలియం హాన్సన్ (Britain's Etiquette expert William Hanson) అరటిపండును తినేందుకు కూడా ఓ పద్ధతి ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేశారు. అందులో అరటిపండును ఫోర్క్, నైఫ్ సహాయంతో ప్లేటులో పెట్టుకుని తినాలని సూచించాడు. 'మనం కోతి లాగా పండును చెయ్యితో తినకూడదు' అంటూ తొక్క తీయని అరటిపండును ప్లేటులో పెట్టుకున్నాడు. అనంతరం రెండు చివరలను కత్తితో కట్ చేసి, తొక్కను కత్తితో చెక్కి, ఫోర్క్‌తో ముక్కలుగా చేసి తినాలి అని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక నెటిజన్లు ఈ విధానాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. పలువురు సరదాగా స్పందిస్తూ 'అరటిపండును ఇలా తినాలని తెలియక మాములుగా తినేశానే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






