- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంతకు తెగించార్రా... చీరల పేరుతో పచ్చి మోసం!
కాలం మారినాకొద్ది.. మార్కెట్లో ( Markets) రకరకాల మోసాలు తెరపైకి వస్తున్నాయి. కాస్త చనువు ఇస్తే చాలు... చంకనెక్కి

దిశ, వెబ్ డెస్క్: కాలం మారినాకొద్ది.. మార్కెట్లో ( Markets) రకరకాల మోసాలు తెరపైకి వస్తున్నాయి. కాస్త చనువు ఇస్తే చాలు... చంకనెక్కి కూర్చుంటున్నారు కొంత మంది. మాట కలిపి మోసం చేసేవారు... ఆశ చూపి స్కామ్ ( Scam) చేసేవారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా... షాపింగ్ మాల్స్ ( Shopping Mall) కూడా పెద్ద మోసానికి తెగించాయి. చీరను ( Saree)... డ్రెస్ లాగా తయారు చేసి... పెద్ద మోసమే చేస్తున్నారు.
సాధారణంగా షాపింగ్ మాల్స్ కు వెళ్తే అక్కడ ఖచ్చితంగా... చీరలు కట్టి చూపిస్తారు. అలా చూపిస్తేనే మన మహిళలు కొనుగోలు చేస్తారు. అయితే చీర కట్టడానికి.. చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి కొన్ని షాపింగ్ మాల్స్... మోసానికి పాల్పడుతున్నాయి.
రెడీమేడ్ గా తయారు చేసిన చీరలను... కట్టి, జనాలను మోసం చేస్తున్నారు. ఇక అసలు విషయం తెలియక చీర బాగుందని.. జనాలు కూడా కొనేస్తున్నారు. ఈ మోసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో దీనిపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఎంతకు తెగించార్రా... ఇంత మోసమా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు జనాలు. చీరలు అమ్మడం లోనూ ఇలాంటి మోసాలు ఎందుకు... అవసరమా అంటున్నారు.
ఎంత కు తెగించారు రా
— ismailbhaii (@atheisttindiann) April 19, 2025
చీర కట్టడం రాకుంటే నేర్చుకోవాలి కానీ
ఇలాంటి వి వేసుకుని మోసం చేస్తారా 😐 pic.twitter.com/i7zU1y5dn5






