షాకింగ్ వీడియో.. కంటెంట్ కోసం బాలీకి వెళ్తే.. ప్రాణాలు పోయేంతా పనైంది!

by Yella Dhawani Reddy |

మనలో చాలా మందికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త అనుభవాలు కలిగి మన ప్రయాణాలను ఫొటోలు, వీడియోల ద్వారా ఇతరులతో పంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది.

షాకింగ్ వీడియో.. కంటెంట్ కోసం బాలీకి వెళ్తే.. ప్రాణాలు పోయేంతా పనైంది!
X

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలా మందికి ట్రావెలింగ్ (Travelling) అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. కొత్త ప్రదేశాలు చూడడం, కొత్త అనుభవాలు కలిగి మన ప్రయాణాలను ఫొటోలు, వీడియోల ద్వారా ఇతరులతో పంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అందుకే, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి ట్రావెల్ వ్లాగింగ్‌కు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. ఎంతోమంది యువత ఈ వ్లాగింగ్ (Vlogging) ద్వారా తమ సృజనాత్మకతను చాటుకుంటూ ఫేమస్ అవుతున్నారు. అయితే, ఈ ప్రక్రియలో వారు ఎదుర్కొనే రిస్కులు, అవగాహన లేకపోవడం వల్ల కలిగే ప్రమాదాలు కూడా తప్పనిసరిగా గుర్తించాలి. అమెరికాకు (America) చెందిన ఓ ట్రావెల్‌ వ్లాగర్‌కు బాలీ (Bali) పర్యాటనలో ఇలాంటి ఊహించని భయానక సంఘటన ఎదురైంది. తాజాగా సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

అమెరికాకు చెందిన ప్రసిద్ధ ట్రావెల్ వ్లాగర్ కేటీ జాన్సన్ (Katie Johnson) కంటెంట్‌ క్రియేషన్‌లో భాగంగా బాలీ పర్యాటనకు వెళ్లారు. అక్కడ న్యూసా పెనిడా (Nusa Penida) ద్వీపంలోని అంజెల్‌స్ బిల్లాబాంగ్ వద్ద అల్లకల్లోలంగా మారిన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈస్టర్‌ ఆదివారం అక్కడ ఆమె సెల్ఫీ వీడియో తీస్తుండగా, ఒక్కసారిగా భారీ అల ఆమెపై దూసుకొచ్చింది. ఈ సంఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డ్ అయింది. ఆ వీడియోలో ఆమె ఒక్కసారిగా తడబడుతూ కనిపించగా, కొన్ని క్షణాల్లోనే విజువల్ పూర్తిగా బ్లర్ అయిపోయింది. మొదట దీనిని సరదాగా తీసుకున్న ఆమె, అనంతరం ఇది తన జీవితంలోనే భయంకరమైన అనుభవంగా మిగిలిందని చెప్పారు. మరింత లోతుగా ఆ ప్రదేశం గురించి తెలుసుకోగా.. ఇప్పటికే పది మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడం, భద్రతా సిబ్బంది లేకపోవడం ప్రమాదకరమని ఆమె స్పష్టం చేశారు. పర్యాటకులు అందమైన ప్రదేశాలను ఆనందించడంలో తప్పు లేదు, కానీ భద్రతను మాత్రం ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. వెళ్లే ప్రదేశాల గురించి ముందే పూర్తి సమాచారం సేకరించి, పరిసరాలపై జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా అనుమానం కలిగితే తక్షణమే అక్కడినుండి తప్పుకోవాలన్నారు. అంజెల్‌స్ బిల్లాబాంగ్ వంటి ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఎంతటి అందాన్ని కలిగి ఉన్నా, అక్కడి భద్రతా లోపాలు ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టవచ్చునని ఆమె అనుభవం స్పష్టం చేసింది.

Next Story