వామ్మో.. బాలుడిని ఎత్తుకెళ్లిన గద్ద.. చివరికి ఏం చేసిందో చూస్తే షాక్?(వీడియో)

by Jakkula.Mamatha |   (  Updated:2025-12-14 05:31:31  IST  )

గద్ద(రాబందు)కు చాలా ప్రత్యేకమైన శక్తులు, సామర్ధ్యాలు ఉంటాయనే విషయం తెలిసిందే.

వామ్మో.. బాలుడిని ఎత్తుకెళ్లిన గద్ద.. చివరికి ఏం చేసిందో చూస్తే షాక్?(వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక, పక్షులు, జంతువులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అది ఏంటంటే.. గద్ద(రాబందు)కు చాలా ప్రత్యేకమైన శక్తులు, సామర్ధ్యాలు ఉంటాయనే విషయం తెలిసిందే. గాలిలో వందల మైళ్ళ వేగంతో వెళ్లినా కళ్ళతో అవి స్పష్టంగా చూడగలవు. కిలోమీటర్ల ఎత్తు నుంచి నేలపై ఏముందో పసిగట్టగలవు. గాలిలో ఏదైనా కనిపిస్తే వెంటాడి మరీ నోటితో పట్టేస్తాయి. గద్ద చెరువులోని చేపలను లేదా కోడిపిల్లలను ఎత్తుకెళ్లడం అందరికీ తెలిసిందే. కానీ,

ఓ గద్ద మాత్రం(వీడియో ప్రకారం).. నేలపై ఆడుకుంటున్న ఓ బాలుడిని తన పొడవాటి కాళ్ళతో ఇట్టే పట్టేసింది. బాలుడిని ఎత్తుకెళ్లిపోవడానకి చాలా ప్రయత్నించింది. ఈ తరుణంలో కొంత దూరం ఆ బాలుడిని ఈడ్చుకెళ్లి ఒక చోట విడిచిపెట్టింది. అనంతరం ఆ బాలుడి కుటుంబ సభ్యులు వచ్చి అతనిని తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అయితే ఈ వీడియో పై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అది ఏఐ అని ఒకరు.. కాదు నిజమే అని మరొకరు, ఏదేమైనప్పటికి ఏఐ వచ్చాక ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పడం కష్టంగా మారిందని కామెంట్లు పెడుతున్నారు. వీడియో ఇదే..

Next Story