బాలాజీ ఆలయంలో అమానుషం..మహిళ‌ల జుట్టు ప‌ట్టుకుని !

by velandi.Saikiran |   (  Updated:2026-04-02 06:26:10  IST  )

జోధ్ పూర్ బాలాజీ ఆలయంలో ఇద్దరు మహిళలపై ఓ వ‌ర్గానికి చెందిన‌ వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేశారు.

బాలాజీ ఆలయంలో అమానుషం..మహిళ‌ల జుట్టు ప‌ట్టుకుని !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియాలో మహిళలపై దాడులు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కొంతమందిపై లైంగిక దాడులు జరుగుతుంటే.. మరికొంత మంది మహిళలపై అత్యంత కిరాతకంగా దాడులు కూడా జరుగుతున్నాయి. వరకట్నం, ఇతర కారణాల వల్ల మహిళలను చిన్నచూపు చూస్తూ పురుషులు దండిస్తున్నారు. కొంద‌రినైతే జాలి లేకుండా హ‌త్య చేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలాజీ ఆలయానికి వచ్చిన ఇద్దరు మహిళలపై అత్యంత దారుణంగా ఓ వర్గానికి సంబంధించిన వాళ్లు కొట్టారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆల‌యంలో మ‌హిళ‌ల‌పై దాడి

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో బాలాజీ ఆలయం ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆలయంలో రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దర్శనం సమయంలో క్యూ లైన్ దగ్గర గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలపై ఓ వ‌ర్గానికి చెందిన‌ వ్యక్తులు అత్యంత దారుణంగా దాడి చేశారు. భక్తుల సమక్షంలోనే మహిళలను జుట్టు పట్టుకొని కొట్టారు. కాళ్లు పట్టి ఈడ్చుకెళ్ళారు. ఆపండి... మమ్మల్ని కొట్టకండి.. ఎవరైనా కాపాడండి అంటూ బాధిత మహిళలు ఆర్తనాదాలు పెట్టారు. అయినప్పటికీ ఈ ఘటనను చూస్తూ ఉండిపోయారు అక్కడ ఉన్న భక్తులు.

ఇదంతా గర్భగుడిలోనే జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన వైరల్ అయిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అటు ఈ సంఘటనపై ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా మహిళలను కొట్టడం దారుణమని..దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Next Story