- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: నడి రోడ్డుపై షాకింగ్ సీన్.. మూడు పాముల ముచ్చటైనా సయ్యాట
భూమిపై విషపూరితమైనవి, విషరహితమైనవి.. ఇలా ఎన్నో రకాల జాతులకు చెందిన పాములున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భూమిపై విషపూరితమైనవి, విషరహితమైనవి.. ఇలా ఎన్నో రకాల జాతులకు చెందిన పాములున్నాయి. అడవులు, గుబురుగా చెట్లు, పొదలు ఉన్న చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. కొన్నిసార్లు జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. ఇక సోషల్ మీడియాలో కూడా నిత్యం పాములకు సంబంధించిన అనేక వీడియో వైరల్ అవ్వటం చూస్తుంటాం. ఒక పాము మరో పాముపై దాడి చేయడం,పెద్ద పెద్ద కొండ చిలువులు చిన్న చిన్న పాములను మింగేయడం, రెండు పాములు ఒకదానికొకటి సయ్యాటలాడుకోవటం వంటి వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. కానీ, తాజాగా పాములకు (Snakes) సంబంధించిన ఓ అరుదైన దృశ్యానికి చెందిన వీడియో వైరల్‌గా మారింది. పూణే (Pune) కంటోన్మెంట్ పరిధికి చెందిన ఈ వీడియోలో ఏముందంటే?
ఓ ఆడ పామును అనుసరిస్తూ రెండు మగ పాములు రోడ్డు మీదకు వచ్చాయి. ఇంతలో ఆడ పామును ఓ మగ పాము పెన వేసుకుని సయ్యాటల్లో మునిగింది. పక్కనే ఉన్న మరో పాము నేను కూడా నీ ప్రేమకోసమే వచ్చానన్నట్లుగా అదికూడా ఆ రెండు పాముల మధ్య దూరి అందులో భాగమైంది. ఇంకేముంది ఆ మూడు పాములు పరస్పరం పెనవేసుకుని రోడ్డుమీద దొర్లుతూ సయ్యాటలాడుతూ కనిపించాయి. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు చూసేందుకు పాముల ట్రయంగిల్ లవ్ స్టోరీలా ఉందంటూ కొందరు, ఒక రాణి కోసం ఇద్దరు రాజుల పోరాటమంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






