షాకింగ్ సీన్.. క్షణాల్లో తప్పించుకున్నాడు.. లేదంటే అంతే సంగతి!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-01 09:30:27  IST  )

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

షాకింగ్ సీన్.. క్షణాల్లో తప్పించుకున్నాడు.. లేదంటే అంతే సంగతి!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగిన క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారిపోవటం చూస్తుంటాం. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోస్ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. ఫన్నీ వీడియోలతో పాటు అప్పుడప్పుడూ మనుషులపై పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు దాడులు చేసే వీడియోలు కూడా కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు కొందరు ఇలాంటి ప్రమాదాల నుంచి అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడుతుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తృటిలో పోలార్ బీర్ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఎలాగో చూసేయండి.

నార్వేలోని (Norway) నార్త్ పోల్ మధ్య ఉన్న చిన్న దీవుల సముదాయం స్వాల్‌బార్డ్ (Svalbard). ఇది ఎప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది. పైగా ఈ దేశంలో ఏడాదిలో నాలుగు నెలలు నిరంతరాయంగా చీకటి, నాలుగు నెలల నిరంతరాయంగా పగలు ఉండటంతో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే, తాజాగా పిరమిడెన్ అనే ప్రదేశంలోని ఓ హోటల్‌ సమీపంలోకి ఓ పోలార్ బీర్ (Polar bear) ప్రవేశించింది. గమనించిన సిబ్బంది దాన్ని తరిమేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి దానిపైకి గన్‌ పేల్చాడు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ పోలార్ బీర్ అతడిపైకి దాడికి దూసుకొచ్చింది. వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తి స్నో మొబైల్ మీద అక్కడి నుంచి వెళ్లిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు. అనంతరం హోటల్ సిబ్బంది స్నో మొబైల్ హార్నర్ సౌండ్స్‌ గట్టి గట్టిగా వినిపించి దాన్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇదంతా ఓ టూరిస్టు ఆ హోటల్ గదిలోని విండో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, స్వాల్‌బార్డ్‌లో ప్రజల కన్నా పోలార్ బీర్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ నివసించే ప్రజలు నిత్యం గన్‌ వెంటపెట్టుకుని బయటకు వెళ్తారు. అలాగే, పర్యాటకులు కూడా గైడ్ సాయంతోనే పర్యటించాల్సి ఉంటుంది.

Click For Tweet..

Next Story