- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. పోలీసులను బైక్ పై కోర్టుకు తీసుకెళ్తున్న ఖైదీ(వీడియో)
by Jakkula.Mamatha |
రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది.

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఖైదీతో ఇద్దరు పోలీసులు ద్విచక్ర వాహనం పై వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని లిలితపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే బైక్ పై నిందితుడితో పాటు ఇద్దరు పోలీసులు వెళుతున్నారు. అయితే, ఆ బైక్‌ను నడిపింది క్రిమినల్ కేసుల్లో అరెస్టైన నిందితుడుగా తెలుస్తోంది. పోలీసులు ద్విచక్రవాహనంలో వెనుక కూర్చొని ఖైదీ చేతికి తాడు కట్టి అతనితో డ్రైవింగ్ చేయించారు. పోలీసులు ఖైదీని కోర్టులో హాజరు పరిచేందుకు గాను అతనితోనే బైక్ నడిపించడం వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు. అయితే ఈ షాకింగ్ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






