పంచాయతీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన.. అభ్యర్థుల గుర్తులతో క్షుద్ర పూజలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 03:20:06  IST  )

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

పంచాయతీ ఎన్నికల వేళ షాకింగ్ ఘటన.. అభ్యర్థుల గుర్తులతో క్షుద్ర పూజలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థులు ఏమాత్రం ఖర్చుకు వెనుకాడటం లేదు. సుక్కా, ముక్కతో ఓటర్లకు నిత్యం విందులు ఇస్తున్నారు. అదేవిధంగా ఓటింగ్‌కు ముందు రోజుల్లో డబ్బుతో పాటు చికెన్ పంచుతూ హల్‌చల్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఓడిన సర్పంచ్ అభ్యర్థులు ఓటర్లకు పంచిన డబ్బులను ఇంటింటికీ తిరిగి వసూళ్లు చేస్తున్నారు.

కానీ, ఖమ్మం (Khammam) జిల్లా రూరల్ మండల పరిధిలోని గోళ్లపాడు (Gollapadu) గ్రామంలో మాత్రం ముచ్చట రొటీన్‌ భిన్నంగా ఉందండోయ్. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ అయిపోద్ది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రవి (Ravi) అనే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, రవితో పాటు పోటీలో ఉన్న ఇతరులు ఎలాగైనా ఓడిపోవాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన పని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయం (Panchayat Office) సమీపంలో రవితో మరికొందరికి కేటాయించిన బ్యాలెట్‌ పేపర్‌లోని గుర్తులకు క్షుద్రపూజలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఖమ్మం రూరల్ మండల వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ చిత్రం చూసిన జనం ఎన్నికల్లో గెలవాలంటే ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉండాలి కానీ.. ఇలా క్షుద్రపూజలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. అయితే, ఎన్నికల సమయంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం గోళ్లపాడు గ్రామస్తులలో ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు, పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.

Next Story