- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకింగ్ ఘటన.. ఎగ్జామ్ సెంటర్‌కు ఇలా కూడా వెళ్లొచ్చా!?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియా(Social Media)లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ఫాలోవర్స్‌ను పెంచుకోవాలనే క్రమంలో విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఎక్కువ లైక్స్ రావాలనే ఉద్దేశ్యంతో కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడిన ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వీడియో(Video) నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తి పరీక్షకు హాజరు కావడానికి వినూత్న రీతిలో ప్రయాణం చేశాడు.
పరీక్షాకేంద్రానికి వెళ్లేటప్పుడు ట్రాఫిక్(Traffic)లో ఇరుక్కుపోతే ఎలా అనే టెన్షన్ ఉంటుంది. అయితే అందరిలో ఈ విధమైన టెన్షన్(Tension) ఉండడం కామన్. ఈ తరుణంలో కొంతమందికి మాత్రం చిత్రవిచిత్రమైన ఆలోచనలు వస్తుంటాయి. పరీక్ష కేంద్రానికి ఆలస్యమైతది కావచ్చు.. ట్రాఫిక్‌లో ఇబ్బంది పడటం ఎందుకు? అనుకుంటారు. ఈ క్రమంలో గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఎగ్జామ్ సెంటర్ వద్ద దిగితే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తారు.
కానీ మహారాష్ట్ర(Maharashtra)లోని సతారా జిల్లా(Satara District)కు చెందిన సమర్థ్(Samarth) అనే విద్యార్థి(Student) ఇలాగే పరీక్షా కేంద్రాని(Exam Center)కి గాల్లో ఎగురుకుంటూ వెళ్లాడు. వ్యక్తిగత పనుల కారణంగా సమయం దాటిపోతుండంతో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు పారాగ్లైడింగ్ చేసుకుంటూ ఎగ్జామ్ హాల్ వద్దకు చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.






