డేరింగ్ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపుకుంది.. ఎందుకో తెలిస్తే గుండె ఆగడం ఖాయం!

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-24 14:47:21  IST  )

పెళ్లి(wedding) అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా పెద్ద ఘట్టం. అందుకే పెద్దలు ముందూ.. వెనకాల.. ఒకటికి పదిసార్లు ఆలోచించి పెళ్లిళ్లు చేస్తారు.

డేరింగ్ పెళ్లి కూతురు.. తన పెళ్లిని తానే ఆపుకుంది.. ఎందుకో తెలిస్తే గుండె ఆగడం ఖాయం!
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి(wedding) అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా పెద్ద ఘట్టం. అందుకే పెద్దలు ముందూ.. వెనకాల.. ఒకటికి పదిసార్లు ఆలోచించి పెళ్లిళ్లు చేస్తారు. కానీ.. ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లన్నీ హడావిడిగా హైబ్రిడ్ స్టైళ్లో జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో పెళ్లిలన్నీ వింతగా జరుగుతున్నాయి. పెద్దలు కుదుర్చినవి అయినా.. లవ్ మ్యారేజ్‌లు అయినా.. తాళి కట్టే వరకు గ్యారంటీ ఉండట్లేదు. కొన్ని నిశ్చితార్థం తర్వాత క్యాన్సిల్ అవుతుండగా.. ఇంకొన్ని కాసేపట్లో పెళ్లి అనగా క్యాన్సిల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు లేచిపోవడం, పెళ్లి కొడుకు పారిపోవడం వంటి ఘటనలు రోజూ అనేకం చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే మరో చోట చోటుచేసుకుంది. కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు భారీ ట్విస్ట్ ఇచ్చింది. తన పెళ్లిని స్వయంగా తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక(Karnataka) హసన్లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. తాను వేరే అబ్బాయిని ప్రేమించానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. పోలీసుల రక్షణ మధ్య పెళ్లి మధ్యలోనే తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులంతా నివ్వెరపోయి నిల్చున్నారు.

Next Story