- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాజ్‌గంజ్‌లో షాకింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలబడి ఉన్న యువకుడిని మితిమీరిన వేగంతో కారు ఢీకొట్టింది. తీవ్రగాయాలతో స్థానిక ఆస్పత్రికి తరలించగా ఇప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సీసీటీవీ విజువల్స్ వైరల్ కాగా, డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వైరల్ వీడియోలో కన్పిస్తున్న ప్రకారం.. రోడ్డు పక్కన ఒక యువకుడు బ్యాట్ మాదిరి ఏదో వస్తువు పట్టుకొని క్రికెట్ ఆడుతున్నట్లు ఫోజులు ఇచ్చాడు. మరో యువకుడు రోడ్డు పక్కనే పైప్‌తో మట్టి కుప్పకు నీళ్లు పడుతాడు. అదే సమయంలో అదుపు తప్పి దూసుకొని వచ్చిన కారు పైప్‌తో నీళ్లు పడుతున్న వ్యక్తిని బలంగా ఢీ కోట్టింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. రోడ్డు పక్కన క్రికెట్ ఆడటం ఏమిటని పలువురు నెటిజన్‌లు ప్రశ్నించారు. అక్కడ అతను నీళ్లు ఎందుకు పడుతున్నాడని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఈ ప్రమాదం పూర్తిగా కారు డ్రైవర్ మిస్టేక్ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. అయితే అతను మట్టి కుప్పకు నీళ్లు కొడుతున్నాడని, మరో వ్యక్తి ఒక వస్తువుతో బ్యాటింగ్ ఇమిటేట్ చేశాడని మరో నెటిజన్ కామెంట్ చేశారు. వీడియో ఇదే..






