నడిరోడ్డులో అమ్మాయి బట్టలు చింపేస్తూ వేధింపులు.. అడ్డుకున్న వారిని చంపేస్తానని యువకుడి బెదిరింపులు(వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-11-09 13:08:08  IST  )

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతీనగర్ ప్రాంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి.. నడిరోడ్డులో.. ఓ యువతి బట్టలు చింపేస్తూ.. సెక్సువల్ హరాజ్మెంట్ చేస్తున్నాడు యువకుడు

నడిరోడ్డులో అమ్మాయి బట్టలు చింపేస్తూ వేధింపులు.. అడ్డుకున్న వారిని చంపేస్తానని యువకుడి బెదిరింపులు(వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతీనగర్ ప్రాంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి.. నడిరోడ్డులో.. ఓ యువతి బట్టలు చింపేస్తూ.. సెక్సువల్ హరాజ్మెంట్ చేస్తున్నాడు యువకుడు. అటు ఇటు లాగుతూ చంపేస్తానని బెదిరిస్తుండటంతో.. అమ్మాయి రక్షించాలని కేకలు వేస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఆగిన చాలా మంది తనను రక్షించే ప్రయత్నం చేశారు. కొందరు ఈ ఘటనను వీడియో తీస్తున్నారు. దీంతో నిందితుడు చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా పోలీసులు, డీజీపీని ట్యాగ్ చేసి సమస్యను పరిష్కరించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story