Viral News:అద్దె ఖర్చులు భరించలేక.. ఈ యువతి ఏం చేసిందో చూడండి.. ఏకంగా ఆఫీస్‌లోనే!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-31 12:31:08  IST  )

ఇటీవల కాలంలో ఎక్కువ శాతం యువత మంచి ఉద్యోగం సాధించి పట్టణంలోనే స్థిరపడుతున్నారు.

Viral News:అద్దె ఖర్చులు భరించలేక.. ఈ యువతి ఏం చేసిందో చూడండి.. ఏకంగా ఆఫీస్‌లోనే!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో ఎక్కువ శాతం యువత మంచి ఉద్యోగం సాధించి పట్టణంలోనే స్థిరపడుతున్నారు. ఈ క్రమంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అద్దె ఖర్చులు చాలా పెరిగిపోతున్నాయి. తమ జీతం కంటే కూడా అద్దె ఖర్చులే ఎక్కువ అవుతున్నాయని చాలా మంది దిగులు చెందుతుంటారు. ఈ క్రమంలో ఓ మహిళ అద్దె ఖర్చులకు చెక్ పెట్టడానికి వినూత్న రీతిలో ఆలోచన చేసింది. చైనాలోని హునాన్‌కు చెందిన ఓ యువతి(18) అపార్ట్‌మెంట్ అద్దెకు తీసుకునే బదులు, అధిక అద్దె ధరలను నివారించడానికి తను ఉద్యోగం చేస్తున్న ఆఫీస్‌లోనే స్థిరపడలనే ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో ఆఫీస్‌లోని బాత్రూంలో నివసించడానికి నిర్ణయించుకుంది.

హునాన్‌లోని ఒక ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్న ఆమెకు నెలకు రూ. 31,800 జీతం వస్తుంది. ఈ క్రమంలో నెలకు రూ. 9,415 అద్దెను చెల్లిస్తుంది. ఈ అధిక రెంట్‌ను చెల్లించడానికి ఇబ్బందిగా భావిస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ రెస్ట్‌రూమ్‌ను తన నివాస స్థలంగా ఉపయోగించుకోవాలని తన యజమాని భార్యతో ఆ యువతి చర్చించారు. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికలో వెల్లడించింది. బాత్ రూమ్ అద్దెకు తీసుకున్న తర్వాత ఆమె విద్యుత్, నీటి ఖర్చులు నెలకు కేవలం రూ. 545 చెల్లించేది. ఆమె మొదట్లో నెలకు రూ. 2,290 ఆఫర్ చేసినప్పటికీ, ఆమె యజమాని భార్య నిరాకరించడంతో చాలా తక్కువ మొత్తానికి ఆమె అక్కడే ఉండటానికి అనుమతి లభించింది.

దాదాపు నెల రోజులుగా ఉంటున్న ఆ యువతి బాత్రూమ్ స్టాల్‌ను తాత్కాలిక గృహంగా మార్చేసింది. రహస్యంగా ఉండటం కోసం స్టాల్ తలుపులపై పెద్ద పెద్ద డోర్‌కటన్‌లను వేలాడదీసింది. ప్రతి రాత్రి మడతపెట్టే మంచం ఏర్పాటు చేస్తుంది. బాత్రూంలో తన బట్టలు ఉతకడం, భవనం పైకప్పుపై ఆరబెట్టడం చేస్తుంటుంది. బాత్రూం లో ఉంటున్న ఆమె నిద్రపోతున్నప్పుడు దుర్వసనాలు రాకుండా ఉండటానికి టాయిలెట్‌ను శుభ్రం చేసేది. అయితే.. ఆమె ప్రత్యేకమైన జీవన పరిస్థితి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story